మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు
- అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన చంద్రబాబు
- ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
- వైసీపీ తప్పులు చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపాటు
అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు మాత్రమే అవుతోందని... ఈ ప్రమాదానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. వైసీపీ తప్పులు చేసి... ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు.