పవన్ కల్యాణ్ ఏ గ్రామ సభలో పాల్గొంటారంటే ..!
- 23న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామ సభలు
- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపాలెం గ్రామసభలో పాల్గొననున్న పవన్
- పవన్ పర్యటన ఖరారుతో ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
కాగా, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హజరు అవ్వనున్నారు. ఈ నెల 23న రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. మైడల్ పంచాయతీగా నిలిచినందున మైసూరివారిపల్లెలో నిర్వహించే గ్రామ సభలో డిప్యూటి సీఎం పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.