చంద్రబాబు పేదల పథకాలు ఎత్తివేసి పప్పన్నం పెడుతున్నారు: మాజీ మంత్రి కాకాణి
- అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ఫోటోలు, పచ్చ రంగులపై కాకాణి విమర్శలు
- ప్రజల విరాళాలతో నిర్వహిస్తున్న క్యాంటీన్లకు పచ్చ రంగులు వేయడం ఎంత వరకు సబబని ప్రశ్న
- సీనియర్ ఐపీఎస్ లను వేధించడం అనైతిక పాలనకు పరాకాష్ఠ అంటూ విమర్శ
నెల్లూరులో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. ప్రజల నుండి విరాళాలు సేకరించి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తూ వాటికి పచ్చ (పార్టీ) రంగులు వేయడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. క్యాంటీన్ లలో ఫోటోలు చంద్రబాబువి, విరాళాలు ప్రజలవా? అని కాకాణి నిలదీశారు.