తెలంగాణలో మరికొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- నేటి నుంచి రేపటి వరకు పలుచోట్ల 40 కిలో మీటర్ల వేగంతో గాలులు
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
- ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.