పైలట్ స్మిత్ సాహసం గర్వకారణం.. హనుమాన్ చాలీసా పఠించడం కదిలించింది: చిరంజీవి
- విమానాన్ని కాపాడిన పైలట్‌కు మెగాస్టార్ ప్రశంసలు
- తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కితాబు
- ఆంజనేయస్వామి ఆశీస్సులతో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఫ్లై దుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ క్లిష్ట సమయంలో పైలట్ హనుమాన్ చాలీసా పఠించడం తన మనసును కదిలించిందని అన్నారు. ప్రాణాలకు తెగించి తోటి ప్రయాణికులను కాపాడిన స్మిత్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. "తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై కాపాడారు. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది" అని చిరంజీవి పేర్కొన్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో సహ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ, స్మిత్ ధైర్యంగా పోరాడి కాక్‌పిట్ డోర్ తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి ప్రవేశించి దాడి చేసిన పైలట్‌ను నిలువరించారు. విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 174 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రధాని మోదీతో జరిపిన వీడియో కాల్‌లో, ధైర్యం కోసం తాను హనుమాన్ చాలీసా పఠించానని స్మిత్ స్వయంగా వెల్లడించారు. స్మిత్ సాహసాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు సల్మాన్ ఖాన్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అభినందించారు.