అమరావతి నిర్మాణానికి మొదటి నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన మంత్రి మండిపల్లి
- రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి మండిపల్లి
- రాజధాని నిర్మాణానికి తన మొదటి నెల వేతనం రూ.3,01,116ల చెక్కు అందజేత
- మంత్రి రాంప్రసాద్ రెడ్డిని అభినందించిన సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, వివిధ పార్టీ శ్రేణులు, ప్రముఖులు, సంస్థలు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తన మొదటి నెల వేతనం రూ.3,01,116లను విరాళంగా ఇచ్చారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన మంత్రి ఈ చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ రెడ్డిని అభినందించారు. తన విరాళం గురించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో, ఆయనకు అభిమానులు, టీడీపీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నారు.