అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
- స్కూల్ బస్సు బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
- బాలిక భవిష్య మృతిపై సీఎం దిగ్భ్రాంతి
- ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్న స్కూల్ యాజమాన్యాలపై చర్యలకు ఆదేశించిన సీఎం
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో సోమవారం శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు విద్యార్ధులు స్వల్పంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె నుండి 20 మంది విద్యార్ధులతో బయలుదేరిన బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్ధిని భవిష్య (8) మృతి చెందింది. ఈ ఘటన అనంతరం గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో డ్రైవర్ అక్కడ నుండి పరారయ్యాడు. అయితే ఈ బస్సును యాజమాన్యం ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.