అవతార్-3 మూవీ టైటిల్, విడుదల తేదీ ప్రకటన
- అవతార్ 3 మూవీకి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరు ఖరారు
- 2025 డిసెంబర్ 19న విడుదల కానున్న చిత్రం
- కీలక అప్‌డేట్స్ శనివారం అధికారికంగా ప్రకటన
ఇదిలావుంచితే అవతార్-3 సినిమాలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్ నటించనున్నారు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరిట అవతార్-2 భారత్‌లో విడుదలైంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషలలో విడుదలై ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు జల్లు కురిపించారు.
కాగా అవతార్-3కి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో దర్శకుడు జేమ్స్ కామెరూన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. మూడవ భాగం సినిమాలో కథ.. భూమిని, పండోరను కాపాడే దశలోకి మారుతుందని ప్రకటించారు. ఈ మేరకు పండోర గ్రహం మీద ఇతర సంస్కృతుల కోసం అన్వేషిస్తున్నామని, బ్యాడ్-గయ్ కథను మరింత బలంగా మార్చబోతున్నామని వెల్లడించారు. ఇక సల్లీ కుటుంబానికి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు ఉంటాయని ఆయన వివరించారు.