శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో రెండో వన్డేకి స్టార్ ఆల్ రౌండర్ దూరం
గాయపడి దూరమైన వనిందు హసరంగ స్థానంలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేను జట్టులోకి ఎంపిక చేసినట్టు జట్టు మేనేజ్‌మెంట్ పేర్కొంది. మొదటి వన్డేలో హసరంగ కీలక పాత్ర పోషించాడు. భారత లక్ష్య ఛేదనలో మూడు కీలకమైన వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టాడు. కాగా శ్రీలంక జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్లు మతీశా పతిరన, దిల్షాన్ మధుశంక గాయాల కారణంగా జట్టుకి దూరమయ్యారు. కాగా రెండవ వన్డేకి ముందు భారత ఆటగాళ్లు ఎవరికీ ఎలాంటి గాయాలు లేవు. అయితే జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు ఉండొచ్చనే అంచనాలున్నాయి.