ఒంటరి అవుతారు.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరిక
- ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగించవద్దంటూ మండిపాటు
- బడ్జెట్లో తమిళనాడుకు కేటాయింపులు లేకపోవడంపై మండిపాటు
- పార్లమెంట్లో ఇండియా కూటమి పార్టీల ఆందోళనకు గొంతు కలిపిన స్టాలిన్
- ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికలు అయిపోయాయని, ఇక దేశం గురించి ఆలోచించాలని హితబోధ చేశారు. ‘‘బడ్జెట్-2024 మీ పాలనను కాపాడుతుంది. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడిపించండి. లేదంటే మీరు ఒంటరి అయిపోతారు. మిమ్మల్ని ఓడించిన వారి విషయంలో ఇంకా ప్రతీకారానికి పోవద్దు. మీ రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిస్తే ఒంటరిగా మిగులుతారు’’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
కాగా బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్లో ఈ రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళనల్లో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్టాలిన్ షేర్ చేశారు.