మిగిలిన మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
- ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం
- అమరావతి సహా నాలుగు అంశాలపై శ్వేతపత్రాల విడుదల
- శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న ప్రభుత్వం
ఇప్పటి వరకు నాలుగింటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది.