టైటానిక్‌లా బీజేపీ మునిగిపోవాలంటే మోదీయే బెస్ట్!: సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
- ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే గెలిచిన బీజేపీ
- పది స్థానాల్లో ఇండియా కూటమి విజయం
- బీజేపీ బీటలు వారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయని ట్వీట్
ఇటీవల వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి.