తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
Advertisement

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ

IMD predicts rain in telangana
  • ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చునని వెల్లడి
  • షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • నేటి సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం
రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చునని తెలిపింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని... ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
IMD
Rain
Hyderabad
Telangana

More Telugu News