ఎస్ఐఆర్ కుట్రపూరితం.. సీఈసీ తక్షణమే వైదొలగాలి: ప్రకాశ్ రాజ్
- ఎస్ఐఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన ప్రకాశ్ రాజ్
- ఇంట్లో లేని వాళ్ల ఓట్లు కూడా తొలగించారని మండిపాటు
- దళితులు, ముస్లింలే టార్గెట్ అని ఆరోపణ
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగానే కొందరి ఓట్లను తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ కింద దేశవ్యాప్తంగా సుమారు 13.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాల నుంచి తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యంగా వలస కార్మికులు, దళితులు, ముస్లింల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఇప్పటికే ఏటా ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుండగా, కొత్తగా ఈ ప్రత్యేక సవరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
దేశంలో అక్రమ చొరబాటుదారులు ఉంటే, ఇన్నాళ్లూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేసింది? అని నిలదీశారు. ఇంట్లో లేని వాళ్ల ఓట్లను తీసేశారని మండిపడ్డారు. ముస్లింలు, దళితుల ఓట్లను తొలగించడమే వారి ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.
మరోవైపు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జాబితాల నుంచి పొరపాటున తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.