మొత్తానికి 400 సీట్లు అయితే వచ్చాయి.. కాకపోతే వేరే దేశంలో: బీజేపీని ఉద్దేశించి శశిథరూర్ సెటైర్
- ‘అబ్ కీ బార్ 400 పార్’ కల ఎట్టకేలకు సాకారమైందంటూ ఎక్స్‌లో శశిథరూర్ పోస్ట్
- కాకపోతే వేరే దేశంలో అయిందని బీజేపీకి సెటైర్
- యూకే ఎన్నికల్లో 412 స్థానాల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ
ఈ నేపథ్యంలో బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సెటైర్ వేశారు. ‘‘ఎట్టకేలకు ‘అబ్ కీ బార్ 400 పార్’ సాకారమైంది. కాకపోతే వేరే దేశంలో’’ అని ఎక్స్‌లో సెటైర్ వేశారు. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాలు గెలుచుకోగా, ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది.