మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి
- రెండు రోజుల క్రితం సత్యం భార్య బలవన్మరణం
- కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న రూపాదేవి
రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయారు. కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. హోమియో మందులు కూడా వాడారు. అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ డిప్రెషన్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.