పద్ధతి మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు: మంద కృష్ణ మాదిగ హెచ్చరిక
- పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క సీటూ ఇవ్వలేదని విమర్శ
- మాదిగలకు చేసిన మోసానికి కచ్చితంగా బుద్ధి చెబుతామన్న మంద కృష్ణ
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదని ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే వారి పార్టీ ఉండదు... సీఎంగా రేవంత్ రెడ్డి ఉండరని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని... అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని సూచించారు.