అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి షెడ్యూల్ ఇదే
- ప్రజావేదిక నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు పర్యటన
- పర్యటన అంతా రోడ్డు మార్గంలోనే...
- సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకోనున్న సీఎం
11.02 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకొని... అక్కడ 11.05 గంటల వరకు ఉంటారు.
11.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.15 గంటలకు రాజధానికి పునాదిరాయి వేసిన ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు. 10 నిమిషాల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
11.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.35 గంటలకు రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలను పరిశీలిస్తారు. 12.45 వరకు అక్కడే ఉండి జడ్జిలు, మంత్రుల బంగ్లాలతో పాటు వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు.
12.45 గంటలకు రాయపూడిలోని మినిస్టర్స్ బంగ్లా నుంచి బయలుదేరుతారు.
12.50 గంటలకు సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 1 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు సీఆర్డీఏ ప్రాజెక్టు నుంచి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. సాయంత్రం వరకు అక్కడే ఉంటారు.
సాయంత్రం 5.30 గంటలకు ఏపీ సచివాలయం నుంచి బయలుదేరుతారు.
సాయంత్రం 5.50 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.