ఫాదర్స్ డే స్పెషల్... ఎప్పుడూ చూడని ఫొటో పంచుకున్న నాగచైతన్య

Naga Chaitanya shares never seen before pic
  • నేడు ఫాదర్స్ డే
  • సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు సోషల్ మీడియాలో సందడి
  •  తండ్రితో కలిసున్న చిన్నారి నాగచైతన్య 
  • బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేసిన చైతూ
  • సంతోషం వ్యక్తం చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్
యావత్ ప్రపంచం నేడు (జూన్ 16) ఫాదర్స్ డే జరుపుకుంటోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. తాజాగా, అక్కినేని నాగచైతన్య కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటో పంచుకున్నారు. 

ఈ ఫొటో ఇంతకుముందు ఎవరూ చూడనిది కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. తండ్రి నాగార్జున భుజాలపై ఎక్కి కూర్చున్న చిన్నారి నాగచైతన్యను ఈ ఫొటోలో చూడొచ్చు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. అందులో నాగార్జున చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. నాగచైతన్యకు ఏడెనిమిదేళ్లు ఉండొచ్చని తెలుస్తోంది. 

బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫొటోను చూసి అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ విలక్షణ ప్రేమ కథా చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి కథానాయిక.
Advertisement
Father's Day
Naga Chaitanya
Nagarjuna
AKkineni
Tollywood

More Telugu News