చంద్రబాబు ఇంటికి అమిత్ షా, జేపీ నడ్డా... మంత్రివర్గ కూర్పుపై చర్చ
- బీజేపీ నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చ
- నేటి అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశం
- మంత్రులుగా అవకాశం దక్కిన వారికి ఫోన్ చేయనున్న చంద్రబాబు
అమిత్ షాతో భేటీ తర్వాత... టీడీపీ, జనసేనల నుంచి కేబినెట్లోకి తీసుకునే వారి జాబితాను సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి సమాచారం అందించనున్నారు. ఇప్పటికే పలువురు ఆశావహులు విజయవాడ, గుంటూరులలో మకాం వేశారు. చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం వేచి చూస్తున్నారు.


.



