చంద్రబాబు ప్రమాణస్వీకారం.. గన్నవరం ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖుల రాక
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు ఉదయం 9.30 గంటల లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్పోర్టు డైరెక్టర్ సూచించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. విమాన సర్వీసులన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు.