రామోజీ మృతికి నివాళిగా రేపు షూటింగ్ ల నిలిపివేత
- ఆదివారం సినిమా షూటింగ్ లు బంద్
- నిర్మాతల మండలి ప్రకటన
- ఫిల్మ్ సిటీలో రామోజీ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు
కాగా, రామోజీరావు మరణంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విచారం వ్యక్తం చేసింది. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించింది. రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల మండలి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.