Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ బహిరంగ లేఖ

Krishank open letter to CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టవద్దని ఆయన ఆ లేఖలో కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అంటూ లేఖను ప్రారంభించారు. ఎలాంటి మద్యం కంపెనీలు కూడా తెలంగాణలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పంపించలేదని గత నెలలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని... అలాంటి వార్తలు రాస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత సోం డిస్టిలరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చామని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారన్నారు. ఇది మంత్రి బాద్యతారాహిత్య ప్రకటన అన్నారు.

సోం డిస్టిలరీస్ సంస్థ రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారని పేర్కొన్నారు. దయచేసి కమీషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానీకరమైన మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకు రావొద్దని కోరారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్టిలరీస్‌కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.
Go Back to Shorts
Revanth Reddy
Krishank
BRS
Congress

More Telugu News