Ajith Kumar: 'విశ్వంభర' సెట్‌లో అజిత్ కుమార్‌.. చిరు స్పెష‌ల్ పోస్ట్‌!

Ajith Kumar meets Telugu megastar Chiranjeevi on sets of Vishwambara
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ సెట్‌లో త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా చిరు ఇన్‌స్టా వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ చేశారు. ఇక‌ అజిత్ నటించిన మొదటి సినిమా ‘ప్రేమ పుస్తకం’ మ్యూజిక్ ఆల్బం చిరంజీవి చేతులు మీదుగానే లాంచ్ అయ్యింది. ఆ తరువాత చిరంజీవి, అజిత్‌ మళ్లీ కలుసుకోలేదు. 30 ఏళ్ల‌ తరువాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. 

అలాగే అజిత్‌తో మాత్రమే కాదు.. ఆయన భార్య షాలినితో కూడా చిరంజీవికి ఒక బంధం ఉంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో షాలిని, ఆమె సోద‌రి షామిలి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. ఇలా చిరుతో అజిత్ కుటుంబంకి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. 

ప్రస్తుతం అజిత్ తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న పక్కనే చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో అజిత్ కుమార్.. విశ్వంభర సెట్‌కి వచ్చి చిరును కలిశారు. 

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిరంజీవి ప్ర‌త్యేక పోస్ట్ చేశారు. ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్ సందర్భం, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో న‌టించిన‌ షాలిని గురించి మాట్లాడుకున్నట్లు చిరు త‌న పోస్టులో పేర్కొన్నారు. అలాగే అజిత్‌తో దిగిన ఫొటోలను కూడా మెగాస్టార్‌ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Ajith Kumar
Chiranjeevi
Vishwambara
Tollywood

More Telugu News