రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ... వీడియో ఇదిగో
- పాట్నా శివారులోని పాలీగంజ్ బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- వేదికపైకి వచ్చిన తేజస్వి యాదవ్, రాహుల్, మీసా భారతి
- హఠాత్తుగా కిందకు పడిపోయిన స్టేజీ
- అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు
రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, మీసా భారతి తదితరులు వేదిక పైకి చేరుకున్నారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కాస్త కిందకు పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. దానికి ఆయన వద్దని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.