హైదరాబాద్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న కావ్య.. వీడియో ఇదిగో
- ఐపీఎల్ ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- జీర్ణించుకోలేకపోయిన కావ్యా మారన్
- కెమెరాల కంటపడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు
కావ్య బాధను నెటిజన్లు కూడా పంచుకున్నారు. క్రికెట్‌పై అత్యంత మక్కువ కలిగిన ఫ్రాంచైజీ ఓనర్ ఆమె ఒక్కరేనని ప్రశంసించారు. కావ్య ప్రతి మ్యాచ్‌కు వచ్చి ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిందని, జట్టు ఓడినా విజేత జట్టును అభినందించి టీమ్ స్పిరిట్ చూపిందని పలువురు అభినందించారు. గత సీజన్‌లో జాబితాలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ ఈసారి రన్నరప్‌గా నిలిచినందుకు సంతోషపడాలని మరికొందరు సూచించారు.