ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్‌కు కేన్ మామ హగ్.. నెట్టింట వీడియో వైరల్!
- వర్షం కారణంగా నిన్నటి ఎస్ఆర్‌హెచ్, జీటీ మ్యాచ్ క్యాన్సిల్
- ఈ క్రమంలో ఉప్పల్ మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన
- ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్‌ను కలిసిన ఆ జట్టు మాజీ ఆటగాడు కేన్ విలియమ్సన్
- ఇద్దరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్న వైనం
అయితే, గతేడాది నుంచి ఆయన గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నారు. ఇక హైదరాబాద్‌తో మ్యాచ్ కోసం ఉప్పల్ వచ్చిన కేన్ మామ.. ప్రేక్షకుల మధ్య స్టేడియంలో ఉన్న ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కావ్యా మారన్‌ను హగ్ చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. కావ్యాను కేన్ విలియమ్సన్ హగ్ చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ ఏడాది ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈసారి అనేక రికార్డులను ఎస్ఆర్‌హెచ్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తన జట్టు ఏకంగా ప్లేఆఫ్స్‌కు చేరడంతో ఓనర్ కావ్యా మారన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.