అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్

Three Congress leaders arrested by Telangana police
  • బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై కేసు నమోదు
  • మన్నె సతీశ్, నవీన్, తస్లీమా అరెస్ట్
  • ఇదే కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెండ్రోజుల క్రితమే ఢిల్లీ పోలీసుల నోటీసులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.

కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Amit Shah Fake Video
Telangana
Congress

More Telugu News