రెండో పెళ్లి వార్తలపై ఎట్టకేలకు పెదవి విప్పిన మీనా
- భర్త విద్యాసాగర్ మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా
- కెరియర్‌పై తిరిగి ఫోకస్ పెట్టిన నటి
- భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ప్రశ్న
- ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి
తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తనను రెండోపెళ్లి వార్తలు మరింత బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. నటుడు ధనుష్‌తో తనకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని పేర్కొన్న మీనా.. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు. తనకో ఫ్యామిలీ వుందని, ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.