270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ... జరిమానా లక్ష దాటింది!
- పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ
- నగరంలోని సీసీ టీవీ కెమెరాల్లో అమ్మడి తప్పిదాల చిత్రీకరణ
- రూ.1.36 లక్షల జరిమానా విధించిన పోలీసులు
దాదాపు బెంగళూరు నగరంలోని చాలా వరకు సీసీ కెమెరాల్లో అమ్మడి ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డయ్యాయట. ఇప్పటివరకు ఆ మహిళకు అనేక పర్యాయాలు నోటీసులు పంపుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఆమెపై రూ.1.36 లక్షల జరిమానా విధించినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.