బీసీ బిడ్డను ఇరికించే ప్రయత్నం.. జగన్ పై దాడి ఘటనపై అచ్చెన్న ఫైర్
- నాడు కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డను ఐదేళ్లు జైలుపాలు చేశారన్న అచ్చెన్న
- నేడు బీసీ బిడ్డ సతీశ్‌ను జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
- బోండా ఉమ పేరు చెప్పించే ప్రయత్నం జరుగుతోందన్న కేశినేని చిన్ని
బోండా ఉమను ఇరికించే యత్నం
గులకరాయి కేసులో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత కేశినేని చిన్ని ఆరోపించారు. బీసీ యువకుల్ని బెదిరించి ఉమామహేశ్వరరావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో టీడీపీ క్యాడర్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.