గుజరాత్ బౌలింగ్ ను చితకబాదిన రియాన్ పరాగ్, సంజూ శాంసన్... రాజస్థాన్ భారీ స్కోరు

గుజరాత్ బౌలింగ్ ను చితకబాదిన రియాన్ పరాగ్, సంజూ శాంసన్... రాజస్థాన్ భారీ స్కోరు

Riyan Parag and Sanju Samson hammers Gujarat Titans bowling
  • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు
గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ చీల్చి చెండాడుతూ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు రియాన్ పరాగ్, కెప్టెన్ సంజూ శాంసన్ అర్ధసెంచరీలు నమోదు చేశారు. సొంతగడ్డ జైపూర్ లో ఈ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 పరుగులు చేయగా, సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేయగా, మరో ఓపెనర్ జోస్ బట్లర్ 8 పరుగులకు అవుటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 1, రషీద్ ఖాన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.
Advertisement
Rajasthan Royals
Gujarat Titans
Jaipur
IPL 2024

More Telugu News