ఈరోజు నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఇదిగో!
- తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు
- ఈరోజు రావులపాలెం, రామచంద్రాపురం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
- ప్రతిరోజు 2 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్
రేపు గోపాలపురం, కొవ్వూరులో రోడ్ షోలు ఉంటాయి. ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు, 6న సత్తెనపల్లి, పెదకూరపాడు... 7న పెనమలూరు, పామర్రులో యాత్ర కొనసాగుతుంది. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలను నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సభ, సాయంత్రం 6 గంటలకు రెండో సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు.