Viral Videos: చెన్నైలో విదేశీయుడు హ‌ల్‌చ‌ల్‌.. తాగిన మ‌త్తులో వీరంగం.. వీడియో వైర‌ల్‌!

  • మ‌ద్యం మ‌త్తులో అర్ధ‌న‌గ్నంగా మారి.. రోడ్డుపై వెళ్తున్న వారిని కొర‌క‌డం చేసిన విదేశీయుడు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • చెన్నైలోని రాయ‌పేట‌లో ఘ‌ట‌న‌
Drunk Foreigner Runs Out Naked and Tries To Bite Commuters in Chennai

తమిళనాడు రాజ‌ధాని చెన్నైలో ఓ విదేశీయుడు క‌ల‌క‌లం రేపాడు. పూటుగా మ‌ద్యం తాగిన అత‌డు రోడ్డుపై వెళ్తున్న వారిని కొర‌క‌డం చేశాడు. చెన్నైలోని రాయపేట‌లో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సదరు విదేశీయుడు మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై వ‌చ్చిపోయే వారిని ఇబ్బందుల‌కు గురి చేశాడు. ఆ విదేశీ వ్య‌క్తి తాను ధ‌రించిన టీష‌ర్టు కూడా తీసేసి అర్ధ‌న‌గ్నంగా కొద్దిసేపు రోడ్డుపై హ‌ల్‌చ‌ల్ చేశాడు. 

దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన పోలీసులు స‌ద‌రు విదేశీయుడిని అదుపులోకి తీసుకుని స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అర్ధ‌న‌గ్నంగా ఉన్న విదేశీయుడు రోడ్డుపై వెళ్తున్న ఓ వాహ‌న‌దారుడిని ఆపి కొర‌క‌డానికి ప్ర‌య‌త్నించ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు.

  • Loading...

More Telugu News