పవన్ కు అంత సీన్ లేదని తేలిపోయింది: రోజా
- పవన్ ను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందన్న రోజా
- చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని వ్యాఖ్య
- వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని ధీమా
వపన్ ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని... కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈరోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్నా చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా... కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.