నారా భువనేశ్వరే అడిగారు.. చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం: కొడాలి నాని
- చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామా అంటూ కుప్పంలో సరదా వ్యాఖ్యలు చేసిన భువనేశ్వరి
- ఎన్టీఆర్ బిడ్డ కోరికను తీరుద్దామన్న కొడాలి నాని
- 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదని వ్యాఖ్య
తాజాగా వైసీపీ నేత కొడాలి నాని స్పందిస్తూ... చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరుతున్నారని... తన మననులో ఉన్న మాటను భువనేశ్వరి బయటపెట్టారని.. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని... ఐదు కోట్ల ఆంధ్రులం కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుదామని అన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని జోస్యం చెప్పారు.