అధునాతన ఫీచర్లతో సరికొత్తగా కియా సెల్టోస్‌.. ధర, ఫీచర్లివే

Kia Seltos with advanced features price and features details
  • కొత్త GTX (O), X-Line (O) విడుదల
  • ప్రారంభ ధర రూ.21.56 లక్షలు
  • 28 ADAS F+ భద్రతా ఫీచర్లు
  • HUD, డిజిటల్ కీ సహా ప్రీమియం ఫీచర్లు
  • అందుబాటులో మూడు ఇంజిన్ ఎంపికలు
కియా ఇండియా తన ప్రముఖ ఎస్‌యూవీ సెల్టోస్ శ్రేణిని విస్తరిస్తూ కొత్త GTX (O), X-Line (O) టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.21.56 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.

కొత్త వేరియంట్లతో సెల్టోస్‌లో ADAS F+ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ క్రాసింగ్ కొలిజన్ అవాయిడెన్స్, లేన్ చేంజ్ కొలిజన్ అలర్ట్స్, హైవే డ్రైవింగ్ అసిస్ట్, ఎవాసివ్ స్టీరింగ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ కీ, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్రంట్-రియర్ డ్యాష్‌క్యామ్‌లు, కియా కనెక్ట్ 2.0తో 85కుపైగా కనెక్టెడ్ ఫీచర్లు, రేన్ సెన్సింగ్ వైపర్లు వంటి ప్రీమియం ఫీచర్లను కూడా కంపెనీ అందించింది.

భారత్‌లో సెల్టోస్ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తోంది. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లకు పోటీగా ఉంది.
Kia Seltos
Kia Seltos Price India
Kia Seltos GTX O Features
Kia Seltos X Line O Launch
Kia Seltos ADAS Technology
Kia India SUV New Variants

More Telugu News