పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో నా చేతికి గాయమైంది: షర్మిల
- మెగా డీఎస్సీకి మద్దతుగా ఛలో సెక్రటేరియట్ చేపట్టిన ఏపీ కాంగ్రెస్
- కరకట్ట వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మిగతా టీచర్ పోస్టులు భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్న షర్మిల
కాగా, పోలీసులు తనను అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని షర్మిల వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను మరిచారని విమర్శించారు. మిగతా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేంతవరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు.
కాగా, పోలీసులు 151 నోటీసులు ఇచ్చి షర్మిలను పంపించి వేశారు.