పరిశుభ్రత సామాజిక బాధ్యత.. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు
- నెలకు ఒక రోజైనా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
- పరిశుభ్రత ప్రభుత్వ బాధ్యతే కాదు, అది సామాజిక బాధ్యత అని స్పష్టీకరణ
- చెత్తను సంపదగా మార్చే కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి
- గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కృష్ణా, గోదావరి నదులు కలుషితమయ్యాయని విమర్శ
- రాష్ట్రంలో వర్షపాత లోటుకు పారిశుద్ధ్య లోపాలు కూడా ఓ కారణమని వ్యాఖ్య
పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర సాధనలో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ నెలకు ఒక్క రోజైనా తమ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో జరిగిన "స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర" అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మనం అందించే నిజమైన ఆస్తి స్వచ్ఛాంధ్ర కార్యక్రమమేనని అన్నారు. కేవలం రోడ్లు శుభ్రంగా ఉంటే సరిపోదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం చెత్తను ఒక సమస్యగా కాకుండా, సంపదగా చూస్తోందని, చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో పరిశుభ్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు విమర్శించారు. వారి వైఖరి కారణంగానే కృష్ణా, గోదావరి నదులతో పాటు కాలువల్లోకి మురుగునీరు చేరి తీవ్రంగా కలుషితమయ్యాయని ఆరోపించారు. పర్యావరణంపై పడిన ఈ ప్రభావం వాతావరణ మార్పులకు కూడా దోహదపడిందని, ప్రస్తుతం రాష్ట్రం 53 శాతం వర్షపాత లోటును ఎదుర్కోవడానికి పారిశుద్ధ్య లోపాలు కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పౌరుడు స్వచ్ఛాంధ్రలో భాగస్వామి అయినప్పుడే స్వర్ణాంధ్ర లక్ష్యాలు నెరవేరతాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పాటించిన గ్రామాలు, పట్టణాలు, వివిధ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం తదితరులు పాల్గొన్నారు.