గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్

Big Boss fame Shanmukh arrested in Gaanja case
  • షణ్ముఖ్ అన్నయ్య కోసం ఆయన ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు
  • ఆ సమయంలో గంజాయి తాగుతున్న షణ్ముఖ్
  • ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో బుక్కయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సమయంలో గంజాయి తాగుతూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

ఏపీకి చెందిన మౌనిక అనే యువతిని సంపత్ ప్రేమించాడు. అయితే, ఆమెను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో, తనను సంపత్ మోసం చేశాడంటూ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దీంతో, సంపత్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సమయంలో షణ్ముఖ్ గంజాయి తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో కూడా షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
Go Back to Shorts
Shanmukh
Big Boss
Gaanja
Shanmukh Jaswanth
Shanmukh Arrested

More Telugu News