భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన షురూ... ప్రముఖులతో భేటీలు
- గత ఎన్నికల్లో భీమవరంలో ఓటమిపాలైన పవన్ కల్యాణ్
- ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని ప్రచారం
- పవన్ తాజా పర్యటనతో ఊహాగానాలకు మరింత బలం
ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ నేడు భీమవరం విచ్చేశారు. వరుసగా ప్రముఖులను కలుస్తూ చర్చలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే పవన్ భీమవరం నుంచి బరిలో దిగడం ఖాయమేననిపిస్తోంది.
తొలుత... ఈ ఉదయం భీమవరంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా రాజకియ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.
అనంతరం భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ భీమవరంలో బీజేపీ నేత పాకా సత్యనారాయణ నివాసానికి వెళ్లారు.

