పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఈ సాయంత్రం 'ఎట్ హోమ్'కు గైర్హాజరు
- సాయంత్రం లోక్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం
- రాజమండ్రిలో పవన్ కు అస్వస్థత.. హైదరాబాద్‌కు పయనం
- ఆరోగ్యంపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన, శనివారం సాయంత్రం విజయవాడ లోక్ భవన్‌లో జరగాల్సిన 'ఎట్ హోం' కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లోక్ భవన్ అధికారులకు సమాచారం అందించినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమం జరుగుతుండగానే ఆయనకు జ్వరం తీవ్రమైంది. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
వెంటనే రాజమండ్రిలో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించారు. జ్వరం కాస్త తగ్గుముఖం పట్టాక, తదుపరి విశ్రాంతి నిమిత్తం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పవన్ కల్యాణ్ తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారని, వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉందని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.