వైజాగ్‌లో పార్టీ నేతలతో పవన్ సమావేశం
- నగరంలోని నోవోటెల్‌లో ఉమ్మడి వైజాగ్ నేతలతో ఆదివారం రాత్రి సమావేశం
- గంట పాటు వర్తమాన రాజకీయాలపై చర్చ
- ఈ నెల 20న భీమవరంలో మరో సమావేశం
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 20న జనసేన అధినేత భీమవరానికి వస్తారని ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఓ ప్రకటనలో తెలిపారు. ‘భీమవరం సమీపంలో పెదఅమిరంలోని నిర్మలాదేవి కల్యాణ మండపంలో జనసేన, టీడీపీ ముఖ్యనాయకులతో పవన్ సమావేశమవుతారు. పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చిస్తారు. 21వ తేదీ సాయంత్రం తిరిగి మంగళగిరి వెళ్తారు’’ అని గోవిందరావు వెల్లడించారు.