ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
- బీఆర్ఎస్ నుంచి ఈ రోజు పలువురు నేతలు కాంగ్రెస్లో చేరిక
- ఇలాంటి సమయంలో రాజయ్య భేటీ కావడంతో ప్రాధాన్యత
- సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నేతలు
వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.