రాజ్ కోట్ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. అశ్విన్ ని ఊరిస్తున్న రికార్డు

రాజ్ కోట్ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. అశ్విన్ ని ఊరిస్తున్న రికార్డు

India won the toss and elected to bat first in Rajkot test against England
  • టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, ధృవ్ జురేల్
  • బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా
  • 500 టెస్ట్ వికెట్లకు మరో వికెట్ దూరంలో అశ్విన్
ఇండియా - ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్ కోట్ లో ప్రారంభమయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, జైశ్వాల్ క్రీజులోకి అడుగుపెట్టారు.
 
ఇండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జైశ్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. 

ఇంగ్లాండ్ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. 

ఈ టెస్టులో అశ్విన్ ను ఒక రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు అశ్విన్ ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఇదే సమయంలో మరో 5 వికెట్లు సాధిస్తే జేమ్స్ ఆండర్సన్ 700 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి చేరుతాడు.
Advertisement
Rajkot Test
Team India
Team England

More Telugu News