'పద్మావత్' వ్యాఖ్యలు.. స్వర భాస్కర్ కు కౌంటర్ ఇచ్చిన పూనమ్ పాండే
- ‘పద్మావత్’లోని జోహార్ సీన్‌పై నటి స్వర భాస్కర్ వ్యాఖ్యలు
- స్వర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మోడల్, నటి పూనమ్ పాండే
- చరిత్రను చూపిస్తే తప్పేంటని, స్వర భాస్కర్ చేసినవి తెలివితక్కువ వ్యాఖ్యలని విమర్శ
- స్వరపై వ్యక్తిగత స్థాయిలోనూ విరుచుకుపడ్డ పూనమ్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పై ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలోని ‘జోహార్’ (సామూహిక ఆత్మార్పణ) సన్నివేశంపై స్వర చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. స్వర వ్యాఖ్యలు చాలా తెలివితక్కువవని, ఆమె నుంచి ఇలాంటివి ఊహించలేదని పూనమ్ మండిపడ్డారు.
ఓ జాతీయ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన పూనమ్ పాండే.. స్వర భాస్కర్ వ్యాఖ్యలపై స్పందించారు. "ఒకప్పుడు నేను ఆమెకు అభిమానిని. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. చదువుకుని, తెలివైనదిగా భావించే స్వర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదు" అని పూనమ్ పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కల్పిత కథను కాకుండా, చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగానే సినిమా తీశారని ఆమె వాదించారు.
"ఆమె అలా మాట్లాడటం చాలా తెలివితక్కువ పని. నాలో చాలా కోపం ఉంది. ఆమె మాట తీరు బాగోలేదు, ఆమె ముఖం కూడా బాగోలేదు" అంటూ పూనమ్ వ్యక్తిగత స్థాయిలోనూ ఘాటుగా విమర్శించారు. స్వర నుంచి ఇలాంటి చెత్త మాటలు వస్తాయని ఊహించలేదని ఆమె అన్నారు.
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 31న ఢిల్లీలో జరిగిన 'వుమెన్ లైఫ్ ఫ్రీడమ్' అనే కార్యక్రమంలో స్వర భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె 'పద్మావత్' సినిమా క్లైమాక్స్‌లోని జోహార్ సన్నివేశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు, ఒకవేళ అత్యాచార బాధితురాలు ఆ సినిమా చూస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించాను. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకోనందుకు తానొక పిరికిదాన్ని అని భావించదా? ఇప్పటికే రేప్ ఎపిడమిక్‌తో సతమతమవుతున్న మన సమాజానికి మనం ఇలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నామా?" అని స్వర ప్రశ్నించారు. అత్యాచారం జరగడమంటే ఒక మహిళ జీవితం ముగిసిపోయినట్టేనా అని ఆ సన్నివేశం చెప్పకనే చెబుతోందని, అది చాలా సమస్యాత్మకమని ఆమె విమర్శించారు.
స్వర చేసిన ఈ వ్యాఖ్యలపైనే పూనమ్ పాండే తాజాగా తీవ్రంగా స్పందించారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు నటీమణుల మధ్య మాటల యుద్ధం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.