ఈశ్వర్ సాయి వ్యవహారం.. ఆత్మహత్యాయత్నం చేసిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్!

Madhuri Rathod folk dancer attempted suicide over Eshwar Sai affair
  • జానపద కళాకారిణి మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
  • న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో ఈ తీవ్ర నిర్ణయం
  • గాయకుడు ఈశ్వర్ సాయిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు
  • పరారీలో ఉన్న ఈశ్వర్ సాయి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్
  • మాధురిపై ఈశ్వర్ సాయి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. మరో జానపద గాయకుడు ఈశ్వర్ సాయిపై తాను చేసిన ఫిర్యాదు విషయంలో న్యాయం జరగడం లేదన్న తీవ్ర మనస్తాపంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబసభ్యులు సకాలంలో గమనించి, తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించారు.

ఈశ్వర్ సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేసి, శారీరకంగా వాడుకుని, ఆ తర్వాత వేధించాడని మాధురి రాథోడ్ గతంలోనే హైదరాబాద్‌లోని నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ వీడియోలు సృష్టించి తన పరువుకు భంగం కలిగించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈశ్వర్ సాయిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. అయితే, అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతుండగా, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఈశ్వర్ సాయి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతోనే మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఇదే వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్‌లో మాధురిపై ఫిర్యాదు చేశారు. ఒక హోటల్‌లో ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి వద్దకు తాను వెళ్లగా, తనపై దాడి చేసి ఐఫోన్ లాక్కున్నట్టు ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద మాధురి ఫిర్యాదు, శరణ్య ఫిర్యాదులపై పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ వివాదంలోని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.


Advertisement
Madhuri Rathod
Eshwar Sai
Folk dancer suicide attempt
Narsingi police station
AI morphing video case
Hyderabad folk artist news

More Telugu News