రకుల్-జాకీ భగ్నానీ పెళ్లి కార్డు చూశారా?.. పెళ్లికి గోవాను ఎంచుకోవడం వెనక కారణం అదేనట!
- సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో మండపం, చుట్టూ కొబ్బరి చెట్లతో తెలుపు, నీలం రంగుల్లో కార్డు
- సంవత్సరాల డేటింగ్‌కు 21తో ముగింపు
- గోవాలోనే ఇద్దరూ ప్రేమలో పడడంతో పెళ్లి కూడా అక్కడే
- ఇద్దరూ ఒకే ఏడాది సినీ రంగంలోకి
కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న రకుల్, జాకీ తమ వివాహానికి గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు.
2009లోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్‌సింగ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత యారియాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం దేదే ప్యార్ దే, రన్‌వే 34, చాత్రివాలీ, ఐ లవ్ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి అభిమానుల మనసులు చూరగొంది.