ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా జై షా హ్యాట్రిక్
- వరుసగా మూడోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జై షా
- నేడు ఇండోనేషియాలో ఏసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశం
- జై షా పేరును ప్రతిపాదించిన శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్
- ఏకగ్రీవంగా బలపరిచిన మిగతా సభ్య దేశాలు
ఇండోనేషియాలోని బాలిలో నేడు ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో... మరోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జై షా పేరును శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ సీ) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రతిపాదించారు. మిగతా సభ్య దేశాలన్నీ ఆ ప్రతిపాదనను ముక్తకంఠంతో బలపరిచాయి. దాంతో వరుసగా మూడోసారి కూడా ఏసీసీ అధ్యక్షుడిగా జై షా నియమితులయ్యారు.
దీనిపై జై షా స్పందిస్తూ, ఆసియా క్రికెట్ మండలి సభ్యదేశాలన్నీ తన పట్ల మరోసారి నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఏసీసీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.