ప్రజాసేవకు రాజకీయాలే పరమార్థం కాదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
- తన వయసు 78 సంవత్సరాలన్న నారాయణమూర్తి
- రాజకీయాల్లోకి వచ్చే ప్రణాళిక ఏమీ లేదని స్పష్టీకరణ
- పిల్లలు, మనవళ్లతో గడపడానికే మిగతా జీవితాన్ని వెచ్చిస్తానన్న మూర్తి
ఇతరులతో గౌరవంగా ఎలా మెలగాలో తన పిల్లలకు చెబుతూ ఉంటానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. సంపన్నకుటుంబాల్లో బాత్రూములు శుభ్రం చేసుకోవడం ఇప్పటికీ నిషిద్ధమేనని, కానీ తాను మాత్రం తన పిల్లలకు మరుగుదొడ్లను వారే శుభ్రం చేసుకోవాలని చెబుతూ ఉంటానని తెలిపారు. ఇతరులెవరూ మనకంటే తక్కువేం కాదని, ఏ ఒక్కరినీ తక్కువగా చూడొద్దని వారికి తరచూ చెబుతుంటానని నారాయణమూర్తి తెలిపారు.